బిగ్ బాస్ ఏడో సీజన్ సెప్టెంబర్ 3 న స్టార్ట్ అయింది. వాళ్ళలో ఒక పోటీదారుగా యూట్యూబర్ టేస్టీ తేజ వచ్చాడు. పరిచయ కార్యక్రమాలు అయ్యాక ANR గారి గురించి ఒక మాట చెప్పాలి అని మొదలు పెట్టాడు.
ఆయన తెనాలి లో రైలు కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అని మొదలు పెట్టాడు.
వెంటనే నాగార్జున కట్ చేసి అది తెనాలి కాదు బాబు “గుడివాడ” అని కరెక్ట్ చేసాడు.
అసలు సంబంధం లేని చోటికి ANR పేరు తేవడమే తప్పు.
మళ్ళీ దానిలో చెప్పబోయే సమాచారం సరైనది కాదు.
అయినా ఇలాంటి చిన్న చిన్న బిస్కట్ లకి పడిపోయే వాడు అయితే నాగార్జున అంత సక్సెస్ ఎలా అయ్యేవాడు చెప్పు.