ప్రతీ ఏడాదీ బిగ్ బాస్ లో పోటీదారులు మారుతున్నారు తప్ప ప్రోగ్రాం లో పెద్దగా మార్పులు ఉండటం లేదు. అదే టాస్క్ లు, అవే పద్ధతులు.
మరీ ముఖ్యంగా బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేయడం కోసం అమ్మాయిలు అబ్బాయిల డ్రెస్ లు, అబ్బాయిలు అమ్మాయిల డ్రెస్ లు వేసుకుని డాన్సులు చేసే కార్యక్రమాలు మాత్రం మారటం లేదు. ఇవాళ కూడా యావర్ చేత అమ్మాయిలా డ్రెస్ వేయించి అతని చేత వెకిలి వేషాలు వేయించాడు.
అసలు యావర్ రావడమే స్పెషల్ ఎంట్రీ అని షర్ట్ లేకుండా లోపలకి వచ్చి నాగార్జున చేత బాబూ షర్ట్ వేసుకో అనిపించుకున్నాడు.
దానికి తోడు కాఫీ కోసం హీరో శివాజీ ఇచ్చిన వార్నింగ్ వేరే లెవెల్.
కొంత మందికి కొన్ని ఆహార అలవాట్లు ఉంటాయ్. ఒకవేళ వాటిలో తేడా వస్తే గనక శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే శివాజీ హౌస్ లోకి వచ్చినప్పటి నుండీ కాఫీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి శివాజీ చేత కేకలు పెట్టించి, అవసరం అయితే గోడలు బద్దలు కొట్టుకుని బయటికి పోతానని వార్నింగ్ ఇప్పించుకుని, డ్రామా అంతా అయ్యాక మొత్తానికి ఒక కప్పు కాఫీ ఇచ్చాడు బిగ్ బాస్.