సినిమా రంగంలో ఎప్పుడు ఎవరు ట్రెండ్ లో ఉంటారో అర్థం కాదు. కొన్ని సార్లు ఎంత కష్టపడ్డా కూడా అదృష్టం కలిసి రావాలి. మొదటి సినిమా పెళ్ళి సందD రిలీజ్ అవడం లేట్ అయినా కూడా ఆమెకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
మొదటి సినిమా సరిగా ఆడనప్పటికీ ధమాకా హిట్ అవడం తో లక్కి మస్కట్ గా మారిపోయింది. దానికి తోడు సెకండ్ హీరోయిన్ గా ఎంటర్ అయిన గుంటూరు కారం లో అదృష్టం మారిపోయి మొదటి సారి మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో మొదటి హీరోయిన్ గా మారిపోయింది.
ఇవాళ శ్రీలీల ఏ హీరో తో చేయడం లేదని వెతుక్కోవాల్సిన పొజిషన్ కి వచ్చింది.
రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో స్కంద విడుదలకి సిద్ధం గా ఉంది.